మన శరీరం అనేది ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. చిన్నప్పటి నుంచి శరీరం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ 30 ఏళ్ల తర్వాత ఒక్కో ఫంక్షన్ పనితీరు నెమ్మదిగా తగ్గిపోవడం మొదలవుతుంది. మనకి తెలుసుకోలేని మార్పులు శరీరంలో జరుగుతుంటాయి. ఈ మార్పులను ముందుగానే గుర్తించడానికి కొన్ని టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే "ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్!" అన్నారు పెద్దలు.
ఆరోగ్యం చెడిపోయాక బాధపడటం కన్నా, ముందే జాగ్రత్త పడటం ఎంతో ఉత్తమం.
ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు (Medical Tests) ఏమిటో చూద్దాం:
1. బ్లడ్ షుగర్ టెస్ట్ (Fasting Blood Sugar / HbA1c):
డయాబెటిస్ అనేది ఇప్పుడు చాలా కామన్ అవుతోంది. 30 ఏళ్ల తర్వాత బాడీ ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోవచ్చు. ఖాళీ కడుపుతో బ్లడ్ షుగర్, అలాగే HbA1c టెస్టులు చేయించుకుంటే, బ్లడ్ లో షుగర్ స్థాయి ఎంత ఉందో, ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నామో తెలుసుకోవచ్చు.
ఇలా చేయించుకోవడం వల్ల మనం షుగర్ వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు మరియు దానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లను మార్చుకునే వీలుంటుంది.
2. బీపీ టెస్ట్ (Blood Pressure):
హై బీపీ సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటే అది బయటకి గుర్తించలేము, కానీ హార్ట్, కిడ్నీ, బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కనీసం 6 నెలలకోసారి బీపీ చెక్ చేయించుకోవాలి. ఎక్కువగా పని చేసే వాళ్లు, ఒత్తిడిలో ఉండే వాళ్లు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఉద్యోగ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అందరికీ హై బీపీ ఒక సాధారణ వ్యాధుల అయిపోయింది. దీనిని మనం అశ్రద్ధ చేస్తే తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ముందుగానే జాగ్రత్త పడాలి.
3. లిపిడ్ ప్రొఫైల్ (Cholesterol Test):
గుండెకు సంబంధించిన రోగాలు నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని ముందుగానే పరిశీలించుకోవాలి. టోటల్ కొలెస్ట్రాల్, HDL, LDL, ట్రైగ్లిసరైడ్స్ లెవల్స్ తెలుసుకోవాలి. ఎక్కువైతే ఫుడ్ హాబిట్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
బయట ఫుడ్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది, ఎందుకంటే వాళ్లు కలిపే ఇతర మసాలాల వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది.
ఎక్కువ ఇంటి ఆహార అలవాట్లను మరియు నూనె వస్తువులకు బదులు ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవడం మంచిది.
4. లివర్ మరియు కిడ్నీ ఫంక్షన్ టెస్టులు (LFT, KFT):
శరీరంలో టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేసే రెండు ముఖ్యమైన అవయవాలు లివర్, కిడ్నీలు. ఎక్కువ మందులు వాడటం, ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి వల్ల వీటిపై ప్రభావం పడుతుంది. సంవత్సరానికి ఒక్కసారి ఈ టెస్టులు చేయించుకుంటే చాలా సమస్యలు ముందే గుర్తించి నివారించవచ్చు.
రోజు మనకు శరీరానికి సరిపడా నీటిని కనీసం 8 గ్లాసుల మంచినీరు తాగాలి. అప్పుడే మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి.ʟ
5. థైరాయిడ్ టెస్ట్ (TSH, T3, T4):
మహిళలకే కాకుండా ఇప్పుడు పురుషులకు కూడా థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి. బరువు పెరగడం, అలసట, హెయిర్ ఫాల్, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే చెక్ చేయించుకోవాలి.
6. విటమిన్ డి & బి12 టెస్టులు:
నేటి లైఫ్‌స్టైల్ వల్ల వీటిలో కొరత చాలా మందిలో ఉంది. ఎముకలు బలహీనపడడం, అలసట, మూడ్ డిసార్డర్స్‌కి ఇవి కారణమవుతాయి. కనీసం సంవత్సరకోసారి ఒకసారి చెక్ చేయించుకోవాలి. శరీరానికి విటమిన్ లో ఎంతో అవసరం.
7. ఈసీజీ(ᴇᴄɢ) లేదా ఈకోకార్డియోగ్రామ్:
గుండె బలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది చాలా అవసరం. కుటుంబంలో హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారైతే నిర్లక్ష్యం చేయకుండా గుండెకు సంబంధించిన డాక్టర్‌ను కలిసి టెస్ట్ చేయించుకోవాలి.
ముగింపు మాట:
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. నాకు ఏం అవ్వదులే!" అని అనుకునే రోజులు పోయాయి. మనం ఆరోగ్యంగా ఉండటం కుటుంబానికి, మన భవిష్యత్తు కి మంచిది. కాబట్టి ఏడాదికి ఒక్కసారి అయినా ఈ టెస్టులను చేయించుకుని ఆరోగ్యంగా జీవిద్దాం.

0 Comments